Site icon NTV Telugu

CM Revanth Reddy : గాంధీ పేరు దేశానికి పర్యాయపదం

Revanth Reddy

Revanth Reddy

మన దేశం అన్ని మతాలు, సంస్కృతులు కలసి సహజీవనం చేస్తూ ప్రపంచానికి స్ఫూర్తినిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద శనివారం నిర్వహించిన రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Parineetichopra : తల్లి అయిన స్టార్ హీరోయిన్.. మహేశ్ బాబు హీరోయిన్ ఖుషీ

సీఎం మాట్లాడుతూ.. “గత 35 ఏళ్లుగా రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర నిరంతరంగా జరుగుతోంది. గాంధీ అనే పేరు ఈ దేశానికి పర్యాయపదం. తమపై పోరాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్లు ఏమీ చేయలేకపోయారు, కానీ స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వవాదులు ఆయనను హతమార్చారు. గాంధీని హత్య చేసినవారు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరులు” అని పేర్కొన్నారు.

దేశ సమగ్రత, ఐక్యత కోసం ఇందిరా గాంధీ ప్రాణత్యాగం చేశారని సీఎం గుర్తుచేశారు. “గాంధీ కుటుంబం దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి. రాహుల్‌ గాంధీ ఆలోచనలతోనే తెలంగాణ ప్రభుత్వం కులగణన, సామాజిక న్యాయం, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది” అని తెలిపారు. ఎమ్మెల్యేల అర్హత వయస్సు 21 ఏళ్లకు తగ్గించే అంశంపై కూడా సీఎం స్పందించారు. “యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్న లక్ష్యంతో అసెంబ్లీలో తీర్మానం చేస్తాం” అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Minister Nimmala: ఇద్దరి వ్యక్తిగత గొడవలతో ఆ రెండు కులాలకు ఏమిటి సంబంధం?

Exit mobile version