Site icon NTV Telugu

Revanth Reddy Tweet: అభివృద్ధి అంటారా…?! అరాచకం అంటారా!?

Revanthreddy

Revanthreddy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పార్కును మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించిన విష‌యం తెలిసిందే.. అయితే, జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాన్నాళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వసితులను పోలీసులు వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళ్తున్న కొందరిపై లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను ట్విట్టర్ లో షేర్ చేసిన రేవంత్.. కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు.

బలవంతంగా భూమిని గుంజుకోవడం… బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం… వంటివి అభివృద్ధి అంటారా? అని మంత్రి కేటీఆర్‌ ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. బలవంతంగా భూమిని గుంజుకోవడం… బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం… కేటీఆర్… దీనిని అభివృద్ధి అంటారా…?!అరాచకం అంటారా!? భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు… లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లా…? అని ట్వీట్‌లో రేవంత్ పేర్కొన్నారు.

Exit mobile version