Viral Video : “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా”.. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి మధుర క్షణాలు

  • మనవడి కోరికను తీర్చిన సీఎం
  • వంటగదిలో పూరీలు చేసిన రేవంత్
  • సోషల్ మీడియాలో వైరల్ వీడియో
  • నెటిజన్లను ఆకట్టుకున్న తాత-మనవడి బంధం
Cm Revanth

Cm Revanth

Viral Video : రాజకీయాలు, అధికారిక సమీక్షలు, ప్రజా సమస్యల పరిష్కారంతో నిరంతరం బిజీ బిజీగా గడిపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలోని ఒక సాదాసీదా సామాన్య తాతను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చూసి మురిసిపోతున్నారు. “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అంటూ ముద్దుల మనవడు అడిగిన ముద్దు ముద్దు కోరికను సీఎం రేవంత్ రెడ్డి కాదనలేకపోయారు. తన బిజీ షెడ్యూల్ పక్కనపెట్టి, మనవడి కోసం స్వయంగా వంటిట్లోకి దూరి పూరీలు చేస్తూ గడిపిన కొన్ని అమూల్యమైన క్షణాల వీడియోను ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకున్నారు.

 

చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, పక్కనే ఆత్రుతగా చూస్తున్న ముద్దుల మనవడు.. గుండ్రంగా రాకపోయినా ప్రేమతో ఒత్తిన ఆ డజన్ పూరీలు ఆ తాతా మనవళ్ల బంధానికి అద్దం పట్టాయి. నిరంతరం ప్రజా జీవితంలో గడిపే తనకు, కుటుంబంతో ముఖ్యంగా మనవడితో గడిపిన ఈ కొన్ని క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, “ముఖ్యమంత్రి అయినా మనవడికి మాత్రం ప్రియమైన తాతే” అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్లతో అభినందనలు కురిపిస్తున్నారు. ఈ మీరు చూసేయండి వీడియో..