Site icon NTV Telugu

Revanth Reddy : కేటీఆర్‌ చెప్రాసి ఉద్యోగంకి కూడా అనర్హుడే..

Revanth Reddy

Revanth Reddy

రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పీవీని, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళను ప్రధానినీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడు భట్టిని సీఎల్పీ నేతగా చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దళితున్ని ఓర్వలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచ చరిత్ర మీదంటూ టీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. రాహుల్ మీద నువ్వు ఏ హోదా తో మాట్లాడుతున్నావు.. ముల్కీ నిబంధనల ప్రకారం… కేటీఆర్ చెప్రసి ఉద్యోగంకి కూడా అర్హుడివి కాదంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు.. పూణేలో చదివిన నువ్వు దీనికి అనర్హుడివని, కేసీఆర్‌ కొడుకు అనేదే నికున్న అర్హత అని రేవంత్‌ మండిపడ్డారు. మీ నాయన అందరి దగ్గరికి వెళ్ళి గింగిరాలు తీరగవచ్చు.. మాకు మద్దతు ఇవ్వడానికి వస్తే… అర్హత ఏంటి అని అడుగుతాడు..? రాహుల్ పొలిటికల్ టూరిస్ట్ అనే నువ్వు… బెంగాల్ ఎందుకు పోయావు.. ఒరిస్సా ఎందుకు పోయావు.. మహారాష్ట్ర ఎందుకు పోయావు.. మిమ్మల్ని..దేశ దిమ్మరు అనాలా..? బైరాగి అనాలా..చెప్పు కేటీఆర్ అంటూ రేవంత్‌ రెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు.

Exit mobile version