CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- జగ్గారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం
- 30 ఏళ్లుగా ఆప్తమిత్రుడంటూ కీలక వ్యాఖ్యలు
- ‘వెయ్యి కోట్లు ఇచ్చినా ఇలాంటి నాయకుడు దొరకడు’
- పోటీ చేయనంటే ఇంట్లో పెట్టి తాళం వేయాలన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి వేదికగా జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగ్గారెడ్డి తనకు 30 ఏళ్లుగా ఆప్తమిత్రుడని, ఆయనను కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత సంగారెడ్డి ప్రజలపైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నంబర్ వన్ నాయకులలో జగ్గారెడ్డి ఒకరని, వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన లాంటి ప్రజా నాయకుడు దొరకడని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో జగ్గారెడ్డి ఎప్పుడూ క్రియాశీలంగా ఉండాలని, ఒక సోదరుడిగా ఆయనకు నిరంతరం అండగా ఉంటానని సభాముఖంగా హామీ ఇచ్చారు.
‘పోటీ చేయనంటే ఊరుకోం.. ఇంట్లో పెట్టి తాళం వేయండి!’
రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయనంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడంపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే స్పందించారు. “జగ్గారెడ్డి పోటీ చేయనంటే సరిపోదు.. ఆయన రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాన్ని స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు” అని స్పష్టం చేశారు. ఇంకొకసారి పోటీ చేయనని జగ్గారెడ్డి అంటే, సంగారెడ్డి ప్రజలు ఆయనను వారం రోజుల పాటు ఇంట్లో పెట్టి తాళం వేయాలని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు.
Also Read
- TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
- Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
సంగారెడ్డి ప్రజలకు సీఎం పిలుపు
జగ్గారెడ్డి సేవలు సంగారెడ్డి ప్రాంతానికే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని రేవంత్ రెడ్డి చెప్పారు. క్లిష్ట సమయంలో పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడే నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపైనే ఉందని పిలుపునిచ్చారు. ప్రసంగం ముగింపులో జగ్గారెడ్డికి నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని సీఎం కోరారు.
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?