CM Revanth Reddy: కుల గణన తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. తీర్మానంపై బీఆర్ ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కుల గణనను పటిష్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా గంగుల ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా కుల గణనపై తీర్మానం చేయడమే కాకుండా చట్టం చేస్తే బాగుంటుందన్నారు. అనంతరం కేటీఆర్, కడియం కులగణన పై కన్ఫ్యూస్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఎలాంటి కన్ఫ్యూస్ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కుల గణనపై మాట్లాడుతూ.. సలహాలు సూచనలు ఇవ్వకుండా అనుమానం చెప్పడం అంటే చర్చ పక్కదారి పట్టించండం కాదని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలు కోసం కట్టుబడి పని చేసేది కాంగ్రెస్ అన్నారు. మైనార్టీల స్థితి గతుల పై అధ్యయనం చేసి.. రేసేర్వేషన్ ఇచ్చామన్నారు. మా అనుభవాల అన్నిటినీ క్రోడీకరించి.. ఈ తీర్మానం పెట్టామని క్లారిటీ ఇచ్చారు.
Read also: PM Modi Degree Case: మోడీ విద్యార్హతపై పరువు నష్టం కేసు.. తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు
అన్ని రకాలుగా వారికి అండగా ఉండాలనేది రాహుల్ గాంధీ ఆలోచన అని తెలిపారు. ఆ ఆలోచనకు అనుగుణంగా తీర్మానం ఉందని తెలిపారు. శాస్రీయంగా ప్రణాళిక రూపొందించే క్రమంలో సర్వే ఉంటుందని తెలిపారు. సలహాలు తీసుకోవడానిక్ మాకు భేషజాలు లేవని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే..సభకు ఇచ్చారా మీరు? అని ప్రశ్నించారు. పదేళ్లు అయ్యింది.. రహస్య నివేదిక లాగా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబం దగ్గరే నివేదిక పెట్టుకున్నారని మండిపడ్డారు. మాకు అలాంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. సామాజిక..ఆర్థిక..రాజకీయంగా అవకాశాలు ఇవ్వడానికి ఇంటింటి సర్వే చేస్తామన్నారు. భేషజాలాలకు పోకుండా సూచనలు ఇవ్వాలని కోరారు. తీర్మానంకి చట్టబద్దత లేదన్నటు చేయకండి అన్నారు. మీకు అనుమానం ఉంటే.. సూచనలు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీని కోరారు.
Coach Jai Simha: నేను మద్యం సేవించలేదు.. కూల్ డ్రింక్ మాత్రమే తాగాను: కోచ్ జై సింహా