Revanth reddy: హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విశ్వనగరంలో బాలుడిపై కుక్కలతో దాడి చేసే స్థాయికి పాలన వచ్చింది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హత్ సే హత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. నగర మేయర్, మంత్రిపై తీవ్రంగా మండిపడ్డారు. కుక్కల దాడిలో బాలుడు చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా సారీ చెప్పి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇదని విమర్శించారు.
Read also: Dogs Caught: జిహెచ్ఎంసి స్పెషల్ డ్రైవ్.. నగరవ్యాప్తంగా 500 కుక్కలను..
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కుక్కలకు ఆకలేయడంతో చిన్నారి దాడి చేశారు అనడం.. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామంటూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు ఒకటి జరిగితే మరోలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి పేదల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలన కుక్కల పాలన అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు సంవత్సరాల పాపను కుక్కలు పీక్క తిన్న ఘటనపై క్షమాపణ చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ గూండాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన డజను మంది ఎమ్మెల్యేలను కదిలించేది లేదన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Earthquake: త్వరలో హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ భూకంపాలకు అవకాశం..