ఇటీవల సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మీ అధికారులు హనీ ట్రాప్ లో పడినట్లుగా.. కేసీఆర్ హాని ట్రాక్ లో ఉండవల్లి పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. మంచి పండితుడు.. ఏం చూసి కేసీఆర్ దగ్గరికి ఉండవల్లి వెళ్ళాడో తెలియదంటూ ఆయన సెటైర్లు వేశారు. అంతేకాకుండా తలుపులు మూసి ఏం చూపించారు తెలియదంటూ చురకలు అంటించారు. కేసీఆర్‌నీ ఉండవల్లి కలవడంతో తెలంగాణ ప్రజలను అవమానించారని, తెలంగాణ ప్రజలు… కేసీఆర్‌ను రావణాసుడిగా చూస్తున్నారన్నారు.
మోడీతో కొట్లడేది కేసీఆర్ అంటున్నారు.. అంతా మొనగాడు అయితే … కేసీఆర్ అవినీతి మీద మాట్లాడినా మోడీ.. కేసీఆర్ మీద యెనిమిది యేండ్లల్లో ఈగ వాలలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే కేసీఆర్.. మోడీకి ఉన్న బంధం అర్థం కాదా..? కేసీఆర్ కి సిగ్గు లేదా..? అని ఆయన మండిపడ్డారు. విభజనపై సుప్రీం కోర్టులో కేసు వేసిన ఉండవల్లి రాసిన బుక్ చదవండి.. తెలంగాణ ఉద్యమ కారులను రజాకార్లు గా అవమానిచిన ఉండవల్లి కి సత్కారం చేశారు కేసీఆర్ అంటూ ఆయన ఆరోపించారు. ఎంత నీచుడు కేసీఆర్ ఆలోచన చేయండంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.