NTV Telugu Site icon

Revanth Reddy: వ్యక్తిగత అంశాలపై కాకుండా.. ప్రజల సమస్యలపై చర్చ పెట్టండి

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రలో మనం కూడా పాల్గొనాలని, వ్యక్తిగత అంశాలు చర్చ పెట్టకుండా ..ప్రజల సమస్యలపై చర్చ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్ లో 138వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు వ్యక్తుల ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే లక్ష్యంగా పని చేస్తోందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. దేశం కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రాణాలు వదిలారని తెలిపారు. గాంధీ బలిదానం అయినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసింది కాంగ్రెస్ అని తెలిపారు రేవంత్‌ రెడ్డి. విదేశీ శక్తుల కుట్రతో రాజీవ్ హత్య జరిగిందని ఆరోపించారు. ఉపాధి హామీ.. విద్యాహక్కు..సమాచార హక్కు చట్టాలు తెచ్చింది సోనియా గాంధీ అని గుర్తుచేశారు రేవంత్‌ రెడ్డి. మహిళా రిజేర్వేషన్ బిల్లుకు అడ్డుపడింది బీజేపీ అని ఆరోపించారు. జానారెడ్డి 2011లో తెలంగాణలో కాంగ్రెస్ మహిళలకి 50 శాతం రిజర్వేషన్ అమలు చేశారన్నారు.

Read also: Lionel Messi: ధోనీ కుమార్తెకు ఫుట్‌బాల్ స్టార్ అపురూప కానుక

బీజేపీ బ్రిటిష్ సిద్ధాంతం ప్రజలపై రుద్దాలని చూస్తుందని మండిపడ్డారు. దేశానికి వస్తున్న ముప్పు నుండి కాపాడటం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్‌ తెలిపారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. దేశం మీద పాక్.. చైనా దాడులు చేయాలని కుట్ర చేస్తున్నాయి అని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, కానీ బీజేపీకి ప్రభుత్వాలు కూల్చడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కోవిడ్ పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర ని ఉపసంహరించుకోవాలని బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో దోపిడీ చాలదు అన్నట్టు కేసీఆర్ పార్టీని దేశ వ్యాప్తం చేయాలని చూస్తున్నారని.. అందుకే పార్టీ విస్తరణ అన్నారు. తెలంగాణ లో ఎన్నో సమస్యలు ఉన్నా ఎందుకు బీజేపీ మీద కొట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. పార్లమెంట్ జరుగుతుంటే ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. ఎందుకు మాట్లాడలేదన్నారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే ప్రజల సమస్యలు పెద్దవని రేవంత్ గుర్తుచేశారు. ప్రజల కోసం జనవరి 26 నుండి ప్రతి ఇంటికి కార్యకర్త చేరుకోవాలని పిలుపు నిచ్చారు. బీజేపీ, కేసీఆర్ ల ప్రజా వ్యతిరేక విధానాలు చెప్పాలని రేవంత్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు కోరారు.
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Show comments