ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే గాంధీకి వెళుతున్న కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు ఉంచారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి 16 వేలకు పెంచాలి అని తెలిపారు. అలాగే వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ ను ఇంత వరకు అతీగతీ లేదు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి. జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలి. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యల పై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలి. కోవిడ్ తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలి అన్నారు. గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అర చేతిలో వైకుంఠం చూపించారు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. నేటి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటన కాకూడదు అని పేర్కొన్నారు.
గాంధీకి వెళుతున్న కేసీఆర్ కు రేవంత్ రెడ్డి డిమాండ్లు…
revanth reddy