NTV Telugu Site icon

ఇలా చెప్పుకోవడానికి సిగ్గులేదా కేటీఆర్‌ : రేవంత్‌ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌పై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. మంచిర్యాలకు చెందిన మహేశ్‌ అనే యువకుడు జాబ్‌ నోటిఫికేషన్‌లు రావడం లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్పందించిన రేవంత్‌ రెడ్డి మరణం.. కాదు రణం చేద్దామంటూ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

అంతేకాకుండా ఓవైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యవత ఆత్మహత్యలకు పాల్పడుతుంటే భారీగా పెట్టుబడులు తీసుకువస్తున్నాం.. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ కబుర్లు చెప్పుకోవడానికి కేటీఆర్‌ సిగ్గులేదా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఉద్యోగాలు రాలేదని మనస్థాపానికి గురి కావద్దని.. మనోధైర్యంతో ముందుకువెళ్లాలని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని పెట్టవద్దని ఆయన కోరారు.