Site icon NTV Telugu

తెలంగాణ పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు

తెలంగాణ పోలీసులపై లోక్‌సభ స్పీకర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని…ఎలాంటి మౌఖిక సమాచారం, లిఖితపూర్వక సమాచారం లేకుండా తన ఇంటిని పోలీసులు మోహరించడం ఈ వారంలో ఇది రెండోసారి అని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.

Read Also: ఫస్ట్‌ రేవంత్‌ను పిలిచి.. నన్ను పిలవండి: జగ్గారెడ్డి

తెలంగాణ పోలీసులు తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని లేఖలో రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదేపదే గృహనిర్బంధం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి తన ఇంట్లోకి వచ్చారని తెలిపారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులతో కలిసి మాట్లాడకుండా తనను పోలీసులు అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నానని స్పీకర్‌కు రాసిన లేఖలో రేవంత్ పేర్కొన్నారు.

Exit mobile version