Revanth Reddy: పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ MLAలపై CBIకి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. Mla ల కొనుగోలు విచారణ ఒకరు దోషిగా.. ఒకరు బాధితుడిగా జరుగుతుందని ఆయన చిట్ చాట్ ద్వారా అన్నారు. Brs వాదన నేరం జరిగింది విచారణ మేమే చేస్తాం అంటున్నారు.. బీజేపీ నేరమే జరగలేదు అంటారు. సీబీఐ విచారణ ఎందుకు అడుగుతున్నారన్నా రేవంత్ పేర్కొన్నారు. సీబీఐ అయితే బీజేపీ చెప్పినట్టు వింటది..Brs చెప్పినట్టు సిట్ వింటుంది అనే క్లారిటీ ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారు ఇద్దరు కలిసి అంటూ మండిపడ్డారు. Mla కొనుగోలు కేసులో ఇంప్లీడ్ అయ్యే అంశంపై పార్టీలో చర్చ చేస్తున్నామన్నారు. Mla కొనుగోలు కేసులో ఇద్దరు అభిచ్యువల్ అఫెండర్ లు అన్నారు. కాంగ్రెస్ లో నుండి టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ నుండి బీజేపీ వెళ్లాలని చూసిన వాళ్లే అని రేవంత్ తెలిపారు.
Read also: Chittoor District: నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
కాంగ్రెస్ లో గెలిచి.. పార్టీ మారిన mla లకు పదవులు వచ్చాయని, పదవులను లంచంగా తీసుకుని చేరారని ఆరోపించారు. అది కూడా ప్రలోభం పెట్టడమే అన్నారు రేవంత్. సీబీఐ కి ఫిర్యాదు చేస్తామన్నారు. వాటిపై కూడా విచారణ చేయాలని లేఖ ఇస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల లావాదేవీలపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. 2018 నుండి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై విచారణ జరగాలన్నారు. పదవులు వచ్చిన వాళ్ళు కొందరు.. మరికొందరికి ఆర్థికంగా లబ్ది జరిగిందని ఆరోపించారు. పార్టీ మారిన అందరి మీద విచారణ జరగాలన్నారు. కేంద్ర హోంశాఖకి.. సీబీఐని కలిస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏం లబ్ది జరిగింది? అనే వివరాలు కూడా సీబీఐకి ఇస్తామన్నారు. కేంద్రం కూడా అన్ని ఫిరాయింపులపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Rohit Reddy: నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ
