NTV Telugu Site icon

Revanth reddy: కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్

Revanth Reddy

Revanth Reddy

Revanth reddy: జేడీఎస్‌ ఓటమితో బీఆర్‌ఎస్‌ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని సంచల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని హర్షం వ్యక్తం చేశారు. జొడో యాత్ర ఫలితం కర్నాటక గెలుపుగా తీసుకెళ్లిందని రేవంత్ పేర్కొన్నారు. గాంధీ భవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సమాధానం చెప్పాలని, జేడీఎస్‌ ఇక ఎటు వైపు ఉంటుందో అని ఎద్దేవ చేశారు. బీజేపీ తో జతకట్టమని చెప్తారా..? అని ప్రశ్నించారు. అలా అయితే.. ఆయన మైత్రి ఏంటో బయట పడుతుందన రేవంత్‌ పేర్కొన్నారు.

Read also: ATM Robbery: ఈ టెక్నీషియన్ మాయలోడే.. ఎంత సింపుల్ గా ఏటీఎం దోచేసాడో సారు

బీజేపీ ఓడిపోయింది కర్నాటకలో, ఇక్కడ కేసీఆర్ మద్దతు ఇచ్చిన జేడీఎస్‌ ఓడిపోయిందని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్‌ ఓటమి తో.. కేసీఆర్ ఓడిపోయినట్టు అంటూ రేవంత్‌ పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారని రేవంత్‌ అన్నారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడని తెలిపారు. తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని రేవంత్ తెలిపారు.
Farmers: పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు.. వడ్లకు నిప్పంటించి నిరసన

Show comments