Site icon NTV Telugu

Revanth Reddy: నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్ .. సోమాజిగూడ నుంచి ర్యాలీ..

Revanth

Revanth

నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండిరింగ్ కేసులో రాహుల్ గాంధీని విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలు మిన్నంటాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన , ఆందళనలు జరుగుతున్నవిషయం తెలిసిందే. అయితే నిరసనలో భాగంగా.. నేడు చలో రాజ్‌భవన్‌కు కాంగ్రెస్‌ పిలుపు నిచ్చింది. సోమాజిగూడ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్‌ నేతల ర్యాలీ చేపట్టనున్నారు.

కాగా.. ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు ఏఐసీసీ చేప‌ట్ట‌నుంది. ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్ భవన్ వరకు వెళ్లనున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకావాలని రేవంత్ రెడ్డి కోరారు. జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని శ్రేణులకు సూచించారు.

ఈడీ విచారణపై రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. ఈడీ విచారణ పేరుతో సోనియా, రాహుల్‌గాంధీలపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ అరాచకాలకు నిరసనగా గురు, శుక్రవారాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించారు.

ఏఐసీసీ కార్యాలయంలోకి దూసుకెళ్లి మరీ అక్కడి నేతలను కొట్టడం హేయమైన చర్యన్నారు. ఇందుకు నిరసనగా గురువారం (నేడు) రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలిపారు. శుక్రవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. రేపు మళ్ళీ వాహుల్ గాంధీని విరణకు రావాలని ఈడీ ఆదేశించడంతో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉదృతంగా మార‌నుంది.

Presidential Poll: తొలి రోజు 11 నామినేషన్లు.. ఏపీ నుంచి ఒకరు

Exit mobile version