NTV Telugu Site icon

Revanth Reddy: తెలంగాణ సంపదని కాలగర్భంలో కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు

Revanth Reddy On Kcr

Revanth Reddy On Kcr

Revanth Reddy Comments On CM KCR In Mulugu District: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ములుగు జిల్లాలో పర్యటిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ వారసత్వ సంపదని కాలగర్భంలో కలిపేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ.. తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కోతుల గుంపుకు రాష్ట్రాన్ని అప్పగించినట్లు అయ్యిందని, అత్యంత విలువైన కళా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదని మండిపడ్డారు. ఆర్కియాలజీ శాఖ నామమాత్రంగా మారిందని, కేసిఆర్ వాస్తు పిచ్చికి కళాఖండాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 8 శతాబ్దాల నాటి రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.

Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం

దేశ భద్రత కూడా ఆందోళనకరంగా తయారైందని.. 2 వేల కి.మీ వరకు చైనా చొచ్చుకు వచ్చినా ప్రధాని మోడీ ఏమీ చేయడం లేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తూ.. ఆర్ధిక వ్యవస్థను పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. అదే స్పూర్తితో తాము హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టామని, మార్పు కోసమే తాను ఈ యాత్ర మొదలుపెట్టామని స్పష్టం చేశారు. గిరిజన సోదరులు ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రేవంత్.. పాదయాత్రకు సంఘీబావం తెలిపిన కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని, మేసిఫెస్టో విడుదల చేస్తాని స్పష్టం చేశారు. కాగా.. ఈరోజు ములుగు జిల్లాలో యాత్రను ముగించుకొని.. రేపు, ఎల్లుండి వరుసగా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో రేవంత్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు.

Satyavathi Rathod: తెలంగాణపై కేంద్రం విషం కక్కుతోంది.. రేవంత్ నీ పార్టీని కాపాడుకో