ప్రభుత్వంని నడిపించాల్సిన సమయంలో పార్టీ మీద కేసీఆర్ దృష్టి పెట్టడానికి కారణం ముందస్తు ఎన్నికలకు పోవడానికే అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు విజయ ఘర్జన సభ పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. పార్టీ మీద పట్టుకోల్పోతున్నాననే భయం ఆయనలో ఉంది. బీజేపీ కూడా కేసీఆర్ కి సహకరించేందుకు హామీ ఇచ్చింది. అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొనేందుకే కేసీఆర్ వరస మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. హుజూరా బాద్ ఎన్నికల తరువాత పార్టీలో తిరుగుబాటు వచ్చింది అన్నారు. హరీష్ రావు మిత్ర ద్రోహి. ఆయన రాజకీయ జీవితం క్లోజ్.
అయితే దళిత బందును ఎవరు వ్యతిరేకించలేదు అని చెప్ప్పిన రేవంత్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యే లను భయ పెట్టేందుకే ముందస్తు లేదు… రెండున్నర ఏళ్ళు నేనే అధికారం లో ఉంటా అని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ కపట నాటక సూత్రధారి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. యూపీ ఎన్నికల కు ఎంఐఎంతో సహా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని పీఎం కి హామీ ఇచ్చారు. దళితులు దళిత బంధు కూడా అడగలేదు. దళితులు అడిగింది ఏబిసిడి వర్గీకరణ … అఖిల పక్షముని ఢిల్లీ తీసుకెళ్తామని తీసుకెళ్లలేదు. కేసీఆర్ దళిత ద్రోహి. కేసీఆర్ అధ్యక్షుడు గా నామినేషన్ వేసిన కార్యక్రమంలో ఒక్క దళితుడు కూడా లేడు. నిన్నటి మీటింగ్ వేదిక మీద ఒక్క దళితుడు కూడా లేడు. కేసీఆర్ దళితుడుని నమ్మడు.. దళితులు కేసీఆర్ ని నమ్మడు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
