NTV Telugu Site icon

Revanth Reddy: కేటీఆర్‌ కు రేవంత్‌ సవాల్‌.. ఆవిషయంలో ఎక్కడికైనా చర్చకు నేను రెడీ

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. టైం, డేట్ కేటీఆర్ ఖరారు చేయాలని, ప్రజల మధ్య తేల్చుకుందాం రేవంత్‌ అన్నారు. కేటీఆర్ ఎక్కడ చెబితే అక్కడ చర్చకు నేను రెడీ అంటూ ఛాలెంజ్‌ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్ ను రేవంత్ రెడ్డి సందర్శించారు. అనంతరం కవితపై ఈడీ విచారణ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాటకం అంటూ రేవంత్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ బీజేపీ ది మిత్రభేదమంటూ మండిపడ్డారు. కవిత విషయంలో మీడియా హడావిడే ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఈడీ విచారణ సాధారణ విషయమే అంటూ కొట్టిపారేశారు. విచారణను కవిత ఎదుర్కోవాలన్నారు. సోనియాను ఈడీ విచారణ సమయంలో కవిత, కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. వాటాల పంపకంలో తేడా వల్లే చిల్లర పంచాయతీ అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.

Read also: Big Breaking: చివరి నిమిషంలో ట్విస్ట్‌.. నేను రాలేనంటూ కవిత లేఖ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై నేను చేసే ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, ఆధారాలు లేకుండా నేను ఆరోపణలు చేయనని అన్నారు. అమర వీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రశాంత్ రెడ్డి అవినీతిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేస్తామన్నారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్ లో గ్రూప్ లు లేవు, వివాదాలు లేవన్నారు. ఏ.ఐ.సీసీ ఆదేశాల మేరకు పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు పాదయాత్రలు చేస్తున్నారని స్పష్టం చేశారు. బట్టి పాదయాత్ర. కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. మహేశ్వర్ రెడ్డి ఠాక్రే కు లేఖ రాసిన విషయం నా దృష్టి కి రాలేదన్నారు. ఠాక్రే నాతో మాట్లాడలేదన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే ఆ గ్రామాల్లో మేం ఓట్లు అడగం, ఇవ్వకపోతే బీఆర్‌ఎస్‌ అడగొద్దంటూ రేవంత్ ఎద్దేవ చేశారు. రెండో విడత పాదయాత్రపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
TS MLC Elections: బండిల్స్ పంపిణీలో గందరగోళం.. మొదటి రౌండ్ ఫలితాలు ఇక అప్పుడే..

Show comments