NTV Telugu Site icon

Revanth Reddy: హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజులు బ్రేక్

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఉగాది పండుగ, ఇతరత్రా కారణాలతో ఈనెల 25 వరకు రేవంత్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్‌ వేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 24, 25 తేదీల్లో మరో సారి నిరుద్యోగ నిరాహార దీక్ష చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేయాలని కాంగ్రెస్ నిర్ణయం చేసింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయ పోరాటం, ప్రజా పోరాటం కాంగ్రెస్ పార్టీ మరింత ఉదృతం చేయనుంది. అనంతరం 26 న జుక్కల్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తారని పార్టీవర్గాలు వెల్లడించాయి.

Read also: Russia : తక్కువ ధరకే ఇండియాకు చమురు సరఫరా.. రష్యా కీలక నిర్ణయం

నిన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర నసుల్లాబాదు నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాదయాత్ర విజయవంతంగా సాగింది. కాగా.. నిన్న రేవంత్‌ రెడ్డికి సిట్‌ అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి ఇంటికి వచ్చిన సిట్‌ అధికారులు ఇంటి గోడకు నోటీసులు అతికించి వెళ్లారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు విచారణ రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక సిట్‌ నోటీసులు తనకు మాత్రమే కాదు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ జనార్థన్‌ లకు కూడా నోటీసులు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌ లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. ఛైర్మన్‌ కేటీఆర్‌కు దగ్గరి బంధువని రేవంత్ చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను టీఎస్‌టీఎస్‌ మాత్రమే నిర్వహిస్తోందని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ రికార్డుల కంప్యూటరీకరణ జరిగిందన్నారు. కంప్యూటర్ల భద్రతపై ఐటీ శాఖ సెక్యూరిటీ ఆడిట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి ఆఫీస్‌ నుంచే లీకేజీ వ్యవహారం మొత్తం నడిచిందని రేవంత్‌ ఆరోపణలు గుప్పించారు.
Constable Adventure: కానిస్టేబుల్ సాహసం..నదిలోకి దూకిన యువతిని కాపాడి హీరో అయ్యాడు