NTV Telugu Site icon

TS Nominations: నేడే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నామినేషన్లు.. దద్దరిల్లనున్న కొండగల్, కరీంనగర్..

Ts Naminations

Ts Naminations

TS Nominations: కొడంగల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీబీజీపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గీతాభవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

రేవంత్ రెడ్డికి కూడా నామినేషన్ సెంటిమెంట్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తాను సూచించిన గుడిలో నిత్యం పూజలు చేస్తుంటాడు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం. తెలంగాణలో ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నందున రేవంత్ రెడ్డి ఈసెంటిమెంట్‌ను మరింత కఠినంగా పాటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కొడంగల్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనెల 8న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎనుముల రేవంత్ రెడ్డి గెలుపొందగా.. ఆ తర్వాత 2009లో కొడంగల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరపున పోటీ చేసి 5976 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండోసారి పోటీ చేసి 14614 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భారస అభ్యర్థిగా రంగంలోకి దిగిన పట్నం నరేందర్ రెడ్డి 2010లో మళ్లీ 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసి 9379 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

హుజూరాబాద్‌ రిజల్ట్‌ గజ్వేల్‌లోనూ పునరావృతం అవుతుందని గజ్వేల్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. 7న గజ్వేల్‌లో నామినేషన్‌ వేస్తున్నానని ప్రజలంతా తరలిరావాలని ఈటల కోరారు. ఆదివారం రాత్రి ములుగు మండలం కొక్కొండ, ఉమ్మడి కొండపాక మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఇక మరోవైపు సీఎం కేసీఆర్ ఈ నెల 9న నామినేషన్ వేయనున్నారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా.. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 240 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు.
Samajika Sadhikara Bus Yatra Day 9: వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే 9.. ఈ రోజు ఏ నియోజకవర్గాల్లో అంటే..