మే 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణకి వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు భరోసా ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ వస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ బాధ పడుతున్న వర్గాలకు అండగా ఉండాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. రైతులు కల్లాల్లో గుండె ఆగి చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు వేశాయని ఆయన మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని భయపెట్టింది సర్కార్.. కలెక్టర్ బెదిరించి వరి వేయద్దు అన్నందుకు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చిందని ఆయన విమర్శించారు.
కేసీఆర్ మాటలు నమ్మి కొందరు రైతు వరి సాగు చేయలేదని, సాగు చేసిన వాళ్ళలో 30 శాతం మిల్లర్లకు అమ్ముకున్నారని ఆయన అన్నారు. . కేసీఆర్, మోడీ మెడలు వంచి వరి కొనిచ్చినది కాంగ్రెస్ అని, కేసీఆర్‌ని నమ్మనివాడు మంచిగా ఉన్నాడన్నారు. కేసీఆర్ ఓ లంగా.. దొంగ మాటలు చెప్తారంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మకండి అని, కేసీఆర్ మాట సగం నమ్మి మోసపోయిన వాడు క్వింటాలుకి ఆరేడు వందలు నష్టపోయారన్నారు.
మా కార్పొరేటర్ ముస్తఫాపై పీడీ కేసులు పెట్టారని, పువ్వాడ అజయ్ జైళ్లకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. పువ్వాడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్.. పువ్వాడ అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు బీహారీ గ్యాంగ్ లాగా మారిపోయారని ఆయన ధ్వజమెత్తారు.
Bandi Sanjay: అన్ని కొంటాన్న మొనగాడు కేంద్రానికి లేఖ ఎందుకు రాసిండో