Site icon NTV Telugu

Revanth Reddy : నేను ట్యాగ్ చేయగానే కోర్ట్‌కి వెళ్లి స్టే తెచ్చుకున్నాడు

TPCC Revanth Reddy Questioned Why the TRS government did not give Details of Drug Cases to the ED Officials.

తెలంగాణలో డ్రగ్స్‌ యథేచ్చగా అమ్మకాలు జరుపుతున్నారని, అంతేకాకుండా యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో నేను స్వయంగా ఈ డ్రగ్స్ కేసులపై విచారణ చేయాలని హైకోర్టును ఆశ్రయించానని ఆయన వెల్లడించారు. ఆ విచారణ సందర్భంగా ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చిందని, హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంటి అంటే.. మాకు ఎలాంటి ఇన్వెస్ట్ గేషన్ ఏజెన్సీ లు అవసరం లేదు అని తెలిపారన్నారు. ఈడీ అధికారులు స్వయంగా మేము విచారణ చేస్తామని చెప్పారని, మరోసారి విచారణకు వచ్చినప్పుడు మా ఇన్వెస్ట్ గేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని స్వయంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ కోర్ట్ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు.

ఇతర దేశాల్లో తయారైన కొకైన్, హెరాయిన్ ను ఇతర రాష్ట్రాలకు వస్తుందని, ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కి రోడ్డు మార్గం ద్వారా డ్రగ్స్ ను తరలిస్తున్నారన్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారని, ఇందులో రాజకీయ నేతలు ప్రమేయంతో ఈ డ్రగ్స్ దందా సాగుతుందని, డ్రగ్స్ కేసుకి సంబంధించిన ఆధారాలన్నీ ఈడీ అధికారులకు ఇవ్వాలని ఎక్సైజ్ అధికారుల ఆదేశించిందన్నారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఇప్పుడు ఈడీ అధికారులు చెప్తున్నారని, డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని సీవీ ఆనంద్ తో పాటు మరో ఇద్దరు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారని ఆయన పేర్కొన్నారు.

కానీ మేము ఐదేళ్లు క్రితమే హెచ్చిరించిన పట్టించుకోలేదని, వేయి మందితో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడం సంతోషమేనన్నారు. కానీ ఈడీ అధికారులకు ఎందుకు ప్రభుత్వం సహకరించడం లేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేటీఆర్ సవాల్ విసిరాడు, ఏ టెస్ట్ లకైనా సిద్ధమని.. నేను కూడా వైట్ చాలంజ్ విసిరిన , నేను కేటీఆర్ ను ట్యాగ్ చేశా.. దీంతో నేను ట్యాగ్ చేయగానే కోర్ట్ కి వెళ్లి, స్టే తెచ్చుకున్నాడన్నారు.

https://ntvtelugu.com/komatireddy-raj-gopal-reddy-counter-to-jagadish-reddy/
Exit mobile version