టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఖమ్మంలో ఓ కార్యకర్తపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి లెక్కా తేలుస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. గ్రానైట్ వ్యాపారైన ఖమ్మంకు చెందిన ఎండీ ముస్తఫా (39) అనే కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ముస్తాఫాపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ ఘటనపైనే రేవంత్ స్పందించి సర్కారు తీరుపై మండిపడ్డారు.