Site icon NTV Telugu

Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే

తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ ఆయన జోస్యం చెప్పారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్‌లుగా ఎంత మందికి అర్హత ఉంది అన్నది చూడాలని ఆయన అన్నారు. ఎస్పీలలో చాలా మందికి అర్హత లేదని ఆయన అన్నారు. అందుకు అధికారులు కేసీఆర్‌కు లాయల్‌గా ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఐదుగురు అధికారుల చేతుల్లో 40 శాఖలున్నాయని.. అధికారుల అండతో సీఎం వేల కోట్లు కొల్లగొడుతున్నారని చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఏ పోరాటం చేసినా గృహ నిర్బంధం చేస్తున్నారని.. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో వేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో వేయడానికి కారణమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ దగ్గర 8 శాఖలు ఉన్నాయని, సుల్తానియా దగ్గర 6 శాఖలు ఉన్నాయని సోమేష్‌ ఆంధ్రకి కేటాయించిన అధికారని ఆయన అన్నారు. మన వాళ్లు కొంత అవగాణ లేకుండా మాట్లాడుతున్నారని, నేను ఉరికేనే మాట్లాడటం లేదన్నారు. తెలివి తక్కవుగా మాట్లాడడం లేదని, ఒక పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నానన్నారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ రేవంత్ జోస్యం చెప్పారు.

Exit mobile version