V. Hanumantha Rao: గాంధీ భవన్ లో ఇంచార్జి థాక్రే తో వి. హనుమంతరావు, దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. అనంతరం పార్టీ కార్యక్రమాలపై చర్చ జరిగిన అనంతరం వి. హనుమాతరావు మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని తెలిపారు. నాయకులు అంతా పాదయాత్రలు చేయాలని పిలుపు నిచ్చారు. రేవంత్ ఫోన్ చేసి పాదయాత్రకి రమ్మన్నారని తెలిపారు. ఒకటి..రెండు రోజులు నేను కూడా రేవంత్ పాదయాత్ర లో పాల్గొంటా అని వీహెచ్ స్పష్టం చేశారు. Mla కొనుగోలు కేసులో ఆయన స్పందిస్తూ.. bl సంతోష్ ఎందుకు హాజరు కారు? అంటూ ప్రశ్నించారు. Bl సంతోష్ ని తప్పించడానికి బీజేపీ కేసు cbi కి అప్పగించిందని ఆరోపించారు. కేంద్రం అన్ని వ్యవస్థలలో జోక్యం చేసుకుంటుందని మండిపడ్డారు. మా mla ల కొనుగోలుపై ఎప్పుడో కోర్టుకు వెళ్లాల్సి ఉండేదని, ఇప్పటికైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని..అందరూ పాదయాత్రలు చేస్తే క్యాడర్ కి మరింత జోష్ పెరుగుతుందని పిలుపు నిచ్చారు వీహెచ్.
Read also: Manda Krishna Madiga: నిధులు కేటాయించక పోతే సీఎం, కేటీఆర్ ఇలాఖాలో ధర్నా చేస్తాం
కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కసరత్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ములుగు నియోజకవర్గంలో రేవంత్ చేరుకున్నారు. రేవంత్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క బొట్టు పెట్టి ఆహ్వానించారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మల ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. పార్టీ హాత్ సే హాత్ జోడో అభియాన్ కు కొనసాగింపుగా చేపట్టిన ‘యాత్ర’తో వైఎస్ మాదిరిగానే ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ రేడ్డి భావిస్తున్నారు.
Read also: Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు
దీంతో.. యాదృచ్ఛికంగా వైఎస్సార్ పై తీసిన సినిమాకు ‘యాత్ర’ అనే టైటిల్ పెట్టారు. ఈనేపథ్యంలో.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేయడానికి ఉద్దేశించిన హాత్ సే హాత్ జోడో అభియాన్ ను తన యాత్రకు విస్తరింపజేయడానికి, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమైన సమస్యలు, విఫలమైన వాగ్దానాలను ఎత్తిచూపడం లక్ష్యంగా ఆయన యాత్రతో ముందుకు సాగుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా.. 2003లో ఉన్న పరిస్థితినే 2023లోనూ పునరావృతం చేస్తున్నారు. ఇక.. విద్యుత్ రంగంలో సంక్షోభం నెలకొందనీ, రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోయిందని, రుణమాఫీ జరుగుతోందని, ఈ సమయంలో యాత్ర చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana Budget: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు.. ఏ రంగానికి ఎన్ని కోట్లు అంటే…