Site icon NTV Telugu

Telangana: సింగరేణిలో బొగ్గు గని ప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

కాగా ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు భూగర్భ బొగ్గు గనిలో పైకప్పు కూలిన సమయంలో ఎస్‌బీఎల్ యంత్రం క్యాబిన్‌లో ఉండగా యంత్రం బయట ఉన్న వీరయ్య స్వల్ప గాయాలతో వెలుపలకు వచ్చారు. ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందించారు. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక బృందం తక్షణమే సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

Exit mobile version