NTV Telugu Site icon

Renuka Chowdhury: బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తే.. అక్రమ కేసులు బనాయించడం దారుణం

Renuka Chowdhury Gas Incide

Renuka Chowdhury Gas Incide

Renuka Chowdhury On Khammam Gas Cylinder Incident: ఖమ్మం జిల్లాలోని చీమలపాడులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం (గ్యాస్ సంఘటన) ఘటనలో గాయపడిన వారిని, కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి రేణుక చౌదరి తాజాగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సంఘటన బాధాకరమని, అమాయకులు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తే.. పోలీసులు అధికార మదంతో వ్యవహరించారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనే 144 సెక్షన్‌తో పాటు ఎక్కడా లేని చట్టాలు గుర్తుకొస్తాయని, అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన సందీప్‌ని హుటాహుటిన హాస్పిటల్ నుంచి తరలించి, దహన సంస్కారాలు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనని ప్రభుత్వ అధికారులు తప్పుదోవ పట్టించి, అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు ఉచితంగా చదువును కల్పించాలని డిమాండ్ చేశారు.

Mallu Ravi: కేసీఆర్ దళిత వ్యతిరేకి.. మల్లు రవి ధ్వజం

లోకల్ మంత్రి ఎందుకు పనికిరారని.. బీఆర్ఎస్ నాయకుల రాజకీయాలకు పేదవారు బలి అవుతున్నారని రేణుక చౌదరి వ్యాఖ్యానించారు. నిమ్స్‌లో నలుగురు చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. నలుగురికి చేతులకు, కాళ్లకు గాయాలవ్వగా.. ఒకరికి ఇన్ఫెక్షన్ రావడంతో కాలు తీసేశారన్నారు. సందీప్ అనే వ్యక్తి చనిపోతే.. దొంగచాటుగా తరలించి అంత్య క్రియలు చేశారని, అతనికి ఒక భార్యతో పాటు కొడుకు ఉన్నాడని తెలిపారు. ఆమెను కూడా ఇక్కడి నుంచి తరలించారని, ఇప్పుడు ఆమె ఆచూకీ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆమెకు రావాల్సిన నష్టపరిహారం కొట్టేయాలని అధికారులు చూస్తున్నారని, ఆమెకు న్యాయం జరగాలని కోరారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు తనని అడుగడుగునా అడ్డుకున్నారన్నారు. బాధితులకు రూ.50 లక్షల నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, బాధిత కుటుంబంలోకి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పోడు భూముల్లో 3 ఎకరాలు ఇవ్వాలని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు.

Ponguleti Srinivasa Reddy: రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వను

ఇదిలావుండగా.. ఖమ్మం జిల్లా కారేపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా, దీనికి కొద్ది దూరంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. దాదాపు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు సైతం వ్యక్తిగతంగా రూ. 2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.