Registrations in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఈ-కేవైసీ సమస్యతో రిజిస్ట్రేషన్లు స్తంభించాయి. సాంకేతిక లోపంతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయలేదు. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక సమస్యను వెంటనే పరిస్కారం చేయాలని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తాము ఏమీ చేయలేమని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అంటున్నారు.
Read Also: Candy Crush: “క్యాండీ క్రష్” గేమ్‌కి బానిసైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఎలా తెలిసిందంటే..
దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్‌లైన్ సేవలు గురువారం నిలిచిపోయాయి. #UIDAI నెట్ వర్కింగ్‌లో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఈ సమస్య తలెత్తింది. దాంతో ఆధార్ ఆధారిత ఓటీపీ సేవలు, రిజిస్ట్రేషన్స్ తదితర సేవలు నిలిచిపోయాయి. ఆ ప్రభావం తెలంగాణలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వీసులపైన పడింది. రిజిస్ట్రేషన్లకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అలా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సర్వీసులను శుక్రవారం నాటికి రీషెడ్యూల్ చేశారు.