Site icon NTV Telugu

Warangal Airport: వరంగల్‌లో రీజియనల్ ఎయిర్ పోర్టు..?

Warangal Airport

Warangal Airport

Warangal Airport: తెలంగాణలోని వరంగల్‌లో ప్రాంతీయ విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయం. అయితే అది ఏ స్థాయిలో ఉంటుంది? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు రూ.1200 కోట్లు ఖర్చవుతుందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదించింది. అయితే అంత ఖర్చు చేయలేమని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏఏఐకి స్పష్టం చేసింది. రూ.500 కోట్లు వరకు మాత్రమే ఖర్చు చేస్తానని ఏఏఐకి పేర్కొంది.

Read also: Mlla Reddy: మల్లా రెడ్డి భూ వివాదం… భారీ బందోబస్తు మధ్య సర్వే..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తారా? లేదా.. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా? అనేది ఎన్నికల తర్వాత క్లారిటీ రానుంది. కాగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయానికి 253 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ ఏఏఐ అధికారులు మాత్రం కనీసం 400 ఎకరాలు కావాలన్నారు. ఏకంగా రూ.1200 కోట్లతో 400 ఎకరాల్లో వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మించడం శుభపరిణామమని నివేదిక ఇచ్చారు. దీనిపై సమీక్షించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం త్వరలో వరంగల్‌కు రానుంది. గతంలో విమానాశ్రయానికి భూమి కేటాయించినప్పుడు ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు. విమానాశ్రయం నిర్మాణానికి ముందు హైదరాబాద్‌లోని జిఎమ్‌ఎమ్‌ఎఆర్‌ ఎయిర్‌పోర్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Yadadri Dress Code: యాదాద్రి భక్తులకు డ్రెస్‌ కోడ్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..

Exit mobile version