NTV Telugu Site icon

Revanth Reddy: రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లోని పెద్ద రెడ్లు ఆ పార్టీకి అమ్ముడు పోయారు..

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: మా పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని అన్నారు. తను PCC chief అయ్యానని, తెలంగాణలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని అన్నారు. 32 నుంచి 34 ఓటింగ్ శాతంలో ఉన్నామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మరో 5 శాతం ఓట్ల కోసం మా పోరాటం అన్నారు రేవంత్‌. అయితే.. కాంగ్రెస్‌ పార్టీలోని పెద్ద రెడ్లు సీఎం కేసీఆర్‌ కు అమ్ముడు పోయారని రేవంత్‌ చేసిన వాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆ పెద్దరెడ్లు ఎవరు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అంటూ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read also: TS High Court: పోడు భూముల పట్టాల పంపిణీపై స్టేకు హైకోర్టు నిరాకరణ

కాగా రేవంత్‌ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ చేరుకుని ఇవాల్టితో మూడురోజుల నేపథ్యంలో.. రేవంత్‌ పాదయాత్ర క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో ముగించుకుని 11వ తేదీ నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకున్న విషయం తెలిసిందే.. ఇవాల (14న) ఉదయం 10 గంటలకు మంచిప్ప రిజర్వాయర్‌ను సందర్శిస్తారు రేవంత్‌. సాయంత్రం 4 గంటలకు మోపాల్ నుంచి కంజర్ – కులాస్‌పూర్ – ముల్లంగి – గణపూర్ మీదుగా పాదయాత్ర సాగనుంది. రాత్రి 7 గంటలకు డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నిజామాబాద్ నగరానికి చేరుకుంటారు. వారు అక్కడే ఉంటారు. ఇక రేపు (15)న తేదీ ఉదయం 9 గంటలకు కంఠేశ్వర శివాలయం, 10 గంటలకు దుబ్బాక భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం 11 గంటలకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. 12 గంటలకు మల్లారంలోని ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయకుండా విక్రయించిన స్థలాన్ని పరిశీలిస్తారు.

Read also: Warangal Crime: వైద్యం ముసుగులో క్షుద్రపూజలు.. హనుమకొండలో ఇద్దరు నకిలీ డాక్టర్స్ అరెస్ట్

సాయంత్రం 4.30 గంటలకు దుబ్బా చౌరస్తా – కెనాల్ కట్టా – నిర్మల హృదయ కాన్వెంట్ – నామ్‌దేవ్ వాడ – రావుజీ సంగం – సతీష్ పవార్ స్క్వేర్ – శివాజీ చౌక్ – రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ – దేవి రోడ్ – భగత్ సింగ్ స్క్వేర్ – జవహర్ రోడ్ – పూసల గల్లి – తుమ్మ బుచ్చయ్య క్రాస్ రోడ్ – గోల్ హనుమాన్ గోల్ హనుమాన్ . రెడ్డి టెంపుల్ – ఆర్యసమాజ్ – బడా బజార్ – ఆజం రోడ్ నుండి నెహ్రూ పార్క్ వరకు నడిచి, అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బోధన్ నియోజకవర్గం సాతాపూర్ చేరుకుని బస చేస్తారు. ఎల్లండి త (16)వ తేదీ ఉదయం 9 గంటలకు సారంగాపూర్‌లోని ప్రాణహిత-చేవెళ్ల పంప్‌హౌస్‌ను సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు నవీపేట్ గ్రామంలోని మార్కండేయ ఆలయాన్ని సందర్శించిన అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అతను సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తాడు. ఎడపల్లి వివేకానంద విగ్రహం నుంచి బోధన్ అంబేద్కర్ కూడలి వరకు నడిచి, ఆపై కార్నర్ సమావేశంలో ప్రసంగించారు. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు ఆర్మూర్ నియోజకవర్గానికి చేరుకుని పెర్కిట్ హైవే పక్కన బస చేస్తారు. ఇక 17న ఉదయం 9 గంటలకు సిద్దుల గుట్ట ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు. పెర్కిట్‌ నుంచి మామిడిపల్లి – ఆర్మూర్‌ కొత్త బస్టాండ్‌ – అంబేద్కర్‌ చౌరస్తా – పాత బస్టాండ్‌, కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనను ముగించనున్నారు.
Budget Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్!