Site icon NTV Telugu

TS Govt Jobs 2024: మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు.. భారీగా వేతనం , అర్హతలివే..!

Ts Govt Jobs 2024

Ts Govt Jobs 2024

TS Govt Jobs 2024: తెలంగాణ మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్‌ఎండీఏ, మూసీ రివర్‌ఫ్రంట్‌తో పాటు టీయూఎఫ్‌ఐడీసీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విభాగాల్లో లీగల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. దరఖాస్తులు ఫిబ్రవరి 29 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. https://www.nium.org.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి.

ముఖ్య వివరాలు:

* రిక్రూట్‌మెంట్ ప్రకటన – మున్సిపల్ శాఖ

* ఉద్యోగాలు – లీగల్ స్పెషలిస్ట్

* మొత్తం ఖాళీలు – 03(HMDA-01, MRDCL-01,TUFIDC-01)

* జీతం – నెలకు రూ. 1 లక్ష

* అర్హతలు – LL.M పూర్తి చేసి ఉండాలి. న్యాయ రంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. పట్టణ చట్టాలపై మంచి అవగాహన ఉండాలి, కాంట్రాక్ట్ ప్రాతిపదికన (ఒక సంవత్సరం) నియామకం. పనితీరు ఆధారంగా పొడిగింపు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 29, 2024.

* షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

* మెయిల్ – hr@nium.org.in.

* అధికారిక వెబ్‌సైట్ – https://www.nium.org.in/

Read also: Devara : ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?

PIB హైదరాబాద్‌లో ఉద్యోగాలు

PIB (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలుగు అనువాదకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 23 చివరి తేదీగా ప్రకటించింది. మెయిల్ లేదా గూగుల్ ఫారమ్‌ను పూరించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ముఖ్య వివరాలు:

* రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ – PIB (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం.

* ఉద్యోగాలు – ఆన్‌లైన్ ట్రాన్స్‌లేటర్స్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ స్పెషలిస్ట్, తెలుగు లాంగ్వేజ్ టైపింగ్

* అర్హతలు – సంబంధిత రంగంలో అనుభవంతో పాటు డిగ్రీ పూర్తి చేయడం తప్పనిసరి.

* ఆన్‌లైన్ అనువాదకులు ఇంటి నుండి పని చేయవచ్చు. మరికొందరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

* ఎంపిక ప్రక్రియ – దరఖాస్తులు పరిశీలించబడతాయి మరియు షార్ట్‌లిస్ట్ చేయబడతాయి.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 23, 2024.

* దరఖాస్తును పూరించడానికి Google ఫారమ్ లింక్ : //forms.gle/B6qW4eg198nfqFzN7

* మెయిల్: pibyderabad@gmail.com

* అధికారిక వెబ్‌సైట్ – https://pib.gov.in/
Sarfaraz Khan: జడేజా సమన్వయ లోపం.. రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్‌

Exit mobile version