Site icon NTV Telugu

రికార్డ్ స్థాయిలో చికెన్ అమ్మ‌కాలు… మూడు రోజుల్లో…

సంక్రాంతికి న‌గ‌రం నుంచి వేలాది మంది సొంతూళ్ల‌కు వెళ్లారు.  న‌గ‌రంలో మూడు రోజుల‌పాటు ట్రాఫిక్ రద్దీ చాలా త‌గ్గిపోయింది. అయితే, స‌గం న‌గ‌రం ఖాళీ అయినప్ప‌టికీ సంక్రాంతి వేడుక‌లు న‌గ‌రంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు.   సంక్రాంతి పండ‌గ‌కు రికార్డ్ స్థాయిలో చికెన్ సేల్స్ జ‌రిగింది.  శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు మూడు రోజుల వ్య‌వ‌ధిలో రికార్డ్ స్థాయిలో 60 ల‌క్ష‌ల కిలోల చికెన్ సేల్స్ జ‌ర‌గింది.  సాధార‌ణంగా గ్రేట‌ర్ ప‌రిధిలో రోజుకు 10 ల‌క్ష‌ల కిలోల చికెన్ వినియోగం అవుతుండ‌గా, సంక్రాంతి పండ‌గ రోజుల్లో ఈ సేల్స్ మ‌రింత‌గా పెరిగింద‌ని వ్యాపారులు చెబుతున్నారు.  

Read: శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

బోగి, సంక్రాంతి రోజున 30 ల‌క్ష‌ల కిలోల చికెన్ విక్ర‌యాలు జ‌ర‌గ‌గా, క‌నుమ రోజైన ఆదివారం రోజున ఏకంగా 30 ల‌క్ష‌ల కిలోల చికెన్ అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్టు వ్యాపారు చెబుతున్నారు.  మూడు రోజుల వ్య‌వ‌ధిలో 10 నుంచి 15 కిలోల మ‌ట‌న్ అమ్మకాలు జ‌రిగిన‌ట్టు వ్యాపారులు చెబుతున్నారు.  

Exit mobile version