Reason Behind Swapnalok Fire Accident Revealed: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గల కారణాలేంటో తాజాగా అధికారులు తేల్చారు. ఎలక్ట్రిక్ వైర్లకు సంబంధించిన డక్ట్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే.. ఈ అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఐదో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగగా.. ఆరు, ఏడు ఆంతస్తులకు వ్యాపించినట్లుగా ఆధారాలు లభించాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించగా.. వారంతా ఒక కార్యాలయంలో పని చేస్తున్నారని తేలింది. పొగలు కమ్మేయడం, చెలరేగిన మంటలకు భయపడి.. వారందరూ బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. శుక్రవారం పోలీసులు, క్లూస్‌టీమ్స్ కాంప్లెక్స్‌లో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించాయి.
Ram Charan: RC16 లీకేజ్ ఇచ్చేసిన రామ్ చరణ్.. రంగస్థలంకి మించి..
తొలుత ఎలక్ట్రిక్ వైర్ల డక్ట్‌లో మొదలైన మంటలు.. నాలుగో ఫ్లోర్ వరకు లోలోపలే విస్తరించాయి. అయితే, ఐదో ఫ్లోర్‌లో డక్ట్ తెరిచి ఉండటంతో, పక్క ఫ్లాట్‌లో ఉన్న కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకింగ్ లిమిటెడ్, క్యూనెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థలకు ఆ మంటలు వ్యాపించాయి. అక్కడి నుంచి ఆరు, ఏడు అంతస్తులకూ మంటలు ఎగబాకాయి. ఆ సమయంలో క్యూనెట్ కార్యాలయం నుంచి ముగ్గురు వ్యక్తులు వెనుకవైపు ఉన్న కిటికీ పగలగొట్టుకొని సజ్జపైకి దిగారు. సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. మిగిలిన ఆరుగురు ప్రాణభయంతో కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. ఒమెగా సంస్థను నిర్వహిస్తున్న సుధీర్ రెడ్డి.. తనతో పాటు రావాల్సిందిగా ఆ ఆరుగురిని కోరారు. అయితే.. దట్టమైన పొగని చూసి వాళ్లు లోపలే ఉండిపోయారు. అలా అక్కడే ఆగిపోయిన ఆ ఆరుగురు.. ఆ పొగ పీల్చుకోవడంతో మృతిచెందారు.
New Districts: రాష్ట్రంలో 19 కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రకటించిన ముఖ్యమంత్రి
ఈ కాంప్లెక్స్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు కావట్లేదని, పైపులు ఉన్నా పని చేయట్లేదని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. కాంప్లెక్స్‌లో ఐదో అంతస్తులో ఫ్లోర్‌కు, మెట్లకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్‌ను లాక్ చేసి ఉంచడం.. అక్కడ సామాన్లు పెట్టుకోవడం కూడా ఆ ఆరుగురు మృతికి కారణమైందన్నారు. మరోవైపు.. ఈ అగ్నిప్రమాదంపై కాంప్లెక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయగా.. సూర్యకిరణ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకింగ్ లిమిటెడ్, క్యూ నెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థలపై ఐపీసీలోని 304 పార్ట్ 2, 324, 420 సెక్షన్లపై కేసు పెట్టి, దర్యాప్తు చేస్తున్నారు.