TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆల్‌టైమ్ రికార్డు..!
- హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త రికార్డు
- ఐటీ హబ్ సమీప భూములకు భారీ డిమాండ్
- గత ఏడాది రేటును దాటేసిన వేలం ధర
- రాయదుర్గం ప్రాంతంపై రియల్ ఎస్టేట్ దిగ్గజాల ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐటీ హబ్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో కళ్లు చెదిరే ధర నమోదైంది. ఇక్కడ ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ.237 కోట్లకు చేరుకోవడం సంచలనంగా మారింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్ 83/1 లో ఉన్న 6 ఎకరాల 29 గుంటల ప్రభుత్వ భూమికి టీజీఐఐసీ ఈ-వేలం నిర్వహిస్తోంది. ఈ వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే భూమి ధరలు భారీ స్థాయికి చేరాయి. ఐటీ కంపెనీలు, కమర్షియల్ ప్రాజెక్టులకు అత్యంత అనుకూల ప్రాంతంగా పేరుగాంచిన రాయదుర్గంలో స్థలాల కోసం రియల్ ఎస్టేట్ సంస్థలు తీవ్ర పోటీ పడుతున్నాయి.
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
గత ఏడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి గరిష్టంగా రూ.177 కోట్లకు అమ్ముడవగా, ఈసారి ఆ రికార్డు పూర్తిగా బద్దలైంది. ప్రస్తుతం నమోదైన రూ.237 కోట్ల ధరతో గత రికార్డుపై మరో రూ.60 కోట్ల పెరుగుదల కనిపించడం విశేషం. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టమైంది.
ఐటీ కారిడార్ విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, కమర్షియల్ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కారణంగా రాయదుర్గం ప్రాంతం రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూముల ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!