NTV Telugu Site icon

Rats Bite Notes: నోట్లు కొరికేసిన ఎలుకలు…లబోదిబోమంటున్న బాధితుడు

Rats Notes

3bac328e 2bf1 41fb Ac0e D5dad0c7372e

ఎలుకల దెబ్బకు కోట్ల రూపాయలు నష్టపోయిన సందర్భాలున్నాయి. కరెంట్ వైర్లు కట్ చేయడం, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు పాడుచేయడం.. పట్టుచీరలు, ఖరీదైన బట్టలు కొరికేస్తుంటాయి. ఎలుకల దాడిలో పంటలు కూడా నష్టపోతుంటారు అన్నదాతలు. కానీ ఆ ఎలుకలు ఓ డ్రైవర్ కి తీరని నష్టం కలిగించాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వేల రూపాయల నోట్లు కొరికి పారేశాయి. దీంతో ఆ డ్రైవర్ లబోదిబోమంటున్నాడు.

ఎలుకా.. కొంపముంచావ్

Read Also: Selfi Video: అప్పులు తీర్చలేక గవర్నమెంట్ ఉద్యోగి షాకింగ్ డెసిషన్

నెలంతా కష్టపడ్డాడు.. వచ్చిన డబ్బులు క్యాబిన్లో పెట్టి నిద్రపోయాడా డ్రైవర్.. నిద్రలేచే సరికి అతని కష్టం ఎలుకల పాలైంది. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన జమీర్ లారీ డ్రైవర్. తనకున్న లారీని నడుపుకుంటూ మహారాష్ట్ర ఔరంగాబాద్ నుంచి నిజామాబాద్ కు ఉల్లిగడ్డలు తీసుకువచ్చాడు. రూ.26 వేలకు లారీ అద్దెకు మాట్లాడుకున్నాడు ఉల్లిగడ్డలు నిజామాబాద్లో అన్లోడ్ చేసేసరికి రాత్రి కావడంతో అద్దెడబ్బులు రూ.26వేలు లారీ క్యాబిల్లో పెట్టి నిద్రపోయాడు. ఉదయం లేచిచూసేసరికి నోట్లన్నీ ముక్కలై కనిపించాయి. కాయకష్టం చేసిన డబ్బులు ఎలుకల పాలు కావడంతో బాధితుడు జమీర్ ఆవేదన చెందారు. తన కష్టం అంతా ఎలుకల పాలైందని.. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదని జమీర్ అంటున్నాడు. డిజిటల్ కరెన్సీ వాడి వుంటే ఈ ఎలుకల బాధ తప్పేదంటున్నారు.

Read Also: Viral Video: ఈ వీడియో చూశారో.. మరోసారి లిఫ్ట్‌ ఎక్కడానికి భయపడతారు!