NTV Telugu Site icon

Rangareddy: సినిమా షూటింగ్ కోసం లొకేషన్ చూపిస్తుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

Tangtoor

Tangtoor

రంగారెడ్డి జిల్లా టంగుటూర్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతంతో శంభారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా షూటింగ్ కోసం టంగుటూరులో లొకేషన్ చూపిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం కావడంతో శంబారెడ్డి స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మోకిలా పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చురికి తరలించారు.

Read Also: 14 DaysGirlFriendIntlo : ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రానికి దర్శక దిగ్గజాల విషేష్

ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు మోకిలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో.. పోలీసుల తీరును నిరసిస్తూ మోకిలా చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. శంబారెడ్డి ఎలా మృతి చెందాడో తేలాలని వారు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా మృతదేహాన్ని మార్చురీకి ఎలా తరలిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Praja Bhavan: ప్రజా భవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం..