Rangareddy: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడా గ్రామ శివారులోని ఓయా సిస్ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సమయానికి రాలేదంటూ స్కూల్ యాజమాన్యం విద్యార్ధులను లోనికి అనుమతించలేదు. దీంతో గేటు బయటే విద్యార్థులు నిలబడాల్సి వచ్చింది. అనుమతించాలని విద్యార్థులు ఎంత ప్రాధేయపడ్డా యాజమాన్యం స్పందించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి ఇక నుంచి ఆలస్యంగా రారని చెప్పిన యాజమాన్యం అస్సలు అనుమతించలేదు.
Read also: Manchu Family : మాట మార్చి.. మడమ తిప్పిన మోహన్ బాబు..
స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వద్ద విద్యార్ధులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటు నినాదాలు చేస్తూ విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ వద్ద ఆందోళన తలెత్తడంతో శంషాబాద్ – షాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు జరిగిన ఘటనపై వివరాలు తెలిపారు. పాఠశాల యాజమాన్యంతో పోలీసులు మాట్లాడతానన్నారు.
Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..