Site icon NTV Telugu

CM Revanth Reddy: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు..

Cm Revanthr Eddy

Cm Revanthr Eddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలు భర్తీకి సిద్దమైనట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు నా శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గుండెల నిండా సంతోషిస్తున్నారని అన్నారు. ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసామన్నారు. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నామన్నారు.

Read also: Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల చిన్నారి.. ఆల్‌టైమ్ లిస్ట్‌లో ఎవరున్నారో తెలుసా?

ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించామన్నారు. ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామన్నారు. మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతామని అన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే… మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి.. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటా అని సీఎం రేవంత్ అన్నారు.
MLC Kavitha: కవిత‌కు మళ్లీ నిరాశ.. జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

Exit mobile version