Rangareddy Fire Accident: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా మంటలు అదపులోకి రాలేదు. పరిశ్రమ పూర్తిగా అగ్నికి ఆహతి అయ్యింది.అయితే.. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. ఇక.. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
Astrology: నవంబర్ 06, బుధవారం దినఫలాలు
Rangareddy Fire Accident: కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
- కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
- అగ్ని ప్రమాదానికి పూర్తిగా నేల మట్టమైన పరిశ్రమ..
- మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న ఫైర్ అధికారులు..
Show comments