Pedda Amberpet: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ లో మైనర్ బాలిక కిడ్నాప్ చేసి, అత్యాచారయత్నం చేసిన నిందితుల నుంచి బాలికను ఓ హిజ్రా కాపాడి మానవత్వం చాటుకుంది. నిందితులనుంచి తప్పించుకుని రోడ్డుపై నిస్సహాయ స్థితిలో వున్న ఆ బాలికను చూసిన హిజ్రా ఆ బాలికను కాపాడింది. తన తల్లి దండ్రుల వద్దకు చేర్చింది.
పెద్ద అంబర్ పేట్ హైవే చెక్ పోస్ట్ సమీపంలో బైక్ పై ఓ బాలిక వెళుతున్న క్రమమంలో ఇద్దరు యువకులు అక్కడకు వచ్చారు. ఆ బాలికను ఆపి మాటలు కలిపారు. ఆప్రాంతంలో ఎవరు లేకపోవడంతో తనని కిడ్నాప్ చేసి అక్కడినుంచి హైవే పక్కకి లాక్కుని వెళ్లారు. తనపై అత్యాచారం చేశారు. ఆ ఇద్దరి యువకుల నుంచి బాలిక తప్పించుకొని రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి వెళ్లే వారికి హెల్ప్ అంటూ అడిగినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. నిస్సహాయ స్థితిలో రోడ్డుపై సహాయం కోసం అరుస్తున్న బాలికను చూసిన ఓ హిజ్రా చలించిపోయాడు. పరుగున ఆ బాలిక వద్దకు వచ్చి ఏం జరిగింది అని అడగగా జరిగిన విషయాన్ని ఆ హిజ్రాకు చెప్పింది. బాలిక తన అన్నయ్యకు కాల్ చేయాలని కోరగా హిజ్రా తన వద్ద ఉన్న ఫోన్ ఇచ్చాడు.
దీంతో హిజ్రా వద్ద వున్న ఫోన్ తీసుకుని ఆ బాలిక తన అన్నకు కాల్ చేసింది. వెంటనే ఘటన స్థలానికిబాలిక తల్లిదండ్రులు.. పోలీసులు.. చేరుకున్నారు. యువకుల నుంచి తప్పించుకునే సమయంలో బాలిక తీవ్రంగా గాయాలయ్యాయి. బాలికను హయత్ నగర్ మ్యాక్సీ క్యూర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే నిందితులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. బాలికను అత్యాచారం చేసేందుకు ప్లాన్ వేసి కిడ్నాప్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువకులు గంజాయి సేవించి ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా? అని విచారాణ చేపట్టారు.
Rajastan: పేపర్ లీకేజీకి పాల్పడితే ఇక యావజ్జీవమే… బిల్లు చేయనున్న రాజస్థాన్ సర్కార్