Newlywed Woman Death: రాజేంద్రనగర్ లో నవ వధువు మృతి చెందింది. అయితే, జన చైత్యన ఫేజ్ టూలో ఉంటున్న కొత్త జంట.. నిన్న (ఆదివారం) రాత్రి అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఫిడ్స్ తో ఐశ్వర్య కుప్పకూలింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక, తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు అని అల్లుడిపై నవవధువు తల్లిదండ్రులు ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా అల్లుడు రాజే తమ కూతురిని చంపేశాడు అంటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రాజు, మహబూబ్ నగర్ కు చెందిన ఐశ్వర్యను ప్రేమించి, పెద్దలను ఎదిరించి గత నవంబర్ నెలలోనే పెళ్లి చేసుకున్నాడు. నెల తిరగక ముందే ఆమె చనిపోవడంతో మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
