Rajendra Nagar: హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా వీరి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడడం లేదన్న విమర్శలున్నాయి. మరికొన్ని చోట్ల గంజాయి సేవించేవారు ముఠాగా ఏర్పడి బీభత్సం సృష్టిస్తున్నారు. గంజాయి మత్తులో రోడ్లపైనే భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై దాడికి పాల్పడ్డారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వారిపై తెల్లవారుజామున దాడి చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ ఎర్రబోడలో ఐదుగురు సభ్యుల ముఠా గంజాయి మత్తులో ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది.
Read also: HMDA Website: హైడ్రా బారిన పడకూడదంటే.. HMDA కొత్త వెబ్‌సైట్‌లో ఇలా చెక్ చేస్కోండి
ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. అంతేకాదు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను కూడా కర్రలతో కొట్టారు. పార్క్ చేసిన వాహనాల అద్దాలను ధ్వంసం చేసి భయాందోళన వాతావరణాన్ని సృష్టించారు. వీరంతా గత కొద్ది రోజులుగా సమీపంలోని నిర్జన ప్రాంతంలో గంజాయి సేవిస్తూ వాకర్స్ పై వేధిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని, పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారినే లక్ష్యంగా చేసుకుని ఈ గంజాయి ముఠా బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు. పోలీసులు చొరవ తీసుకుని గంజాయి ముఠా కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Sangareddy: బావి నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు