NTV Telugu Site icon

Deputy CM: ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందన వెళ్లి గ్రామంలో జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. స్ట్రింగర్ మిషన్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సోలార్ ప్యానల్ ఉత్పత్తికి సంబంధించి గ్లాస్ లోడింగ్, భస్సింగ్, లే అప్, ల్యామినేటింగ్ ఫ్రేమింగ్, క్యూరింగ్ లైన్, క్లీనింగ్ సెక్షన్, సన్ సిమ్ లెటర్, ఐ పోర్టు, ఫైనల్ ఈ.ఎల్ ప్రాసెస్ యూనిట్స్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2030 సంవత్సరం నాటికి ప్రజలకు ఉన్న డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిని చేస్తామన్నారు.

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర హారతి, దర్శన సమయాల్లో మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే..

ప్రపంచంలో మానవ జాతికి విద్యుత్ శక్తికి మధ్యన విడదీయరాని బంధం ఏర్పడిందన్నారు. విద్యుత్ శక్తి అవసరాల డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో ఆ డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాలిక బద్ధంగా సౌర శక్తి, పవన శక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతూ ప్రజల అవసరాలు తీర్చుతామని చెప్పారు. విద్యుత్తు రంగంపై గత ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయల పైబడి అప్పుల భారం మోపిందన్నారు. ఈ అప్పుల భారాన్ని అధిగమించి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడున్న థర్మల్ విద్యుత్తు కు ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతామన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ ను దేశం ప్రజలకు అందించేందుకు దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వేసిన పునాదులు దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలు తీర్చుతున్నాయని వివరించారు. భవిష్యత్తు ప్రజల అవసరాలను తీర్చే విధంగా స్థాపించిన ఈ కంపెనీ వృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.