NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేటలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. అధికారులు, నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రైతులకు ప్లాట్లు కేటాయించే లేఅవుట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ శశాంక బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆయన వెంట టీజీఐఐసీ ఈడీ పవన్, ఆర్డీఓ సూరజ్‌కుమార్, డీఈవో సుశీంధర్ రావు, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Read also: Telangana Assembly 2024: ఇవాళ అసెంబ్లీలో మూడు బిల్లులపై చర్చ.. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం..

కాగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అటానమస్‌ హోదా కల్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాలతో పోటీపడే విధంగా కాకుండా ప్రపంచంతో పోటీపడే విధంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం వివరించారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు, జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశం, ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
Astrology: ఆగస్టు 1, గురువారం దినఫలాలు

Show comments