NTV Telugu Site icon

Rangareddy Crime: విచారణ జరిపించండి.. షాద్ న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్‌ సీరియస్‌..

Shadnagar Crime

Shadnagar Crime

Rangareddy Crime: షాద్ న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పోలీసు ఉన్న‌తాధికారులను ఆదేశించారు. బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అమెరికా ప‌ర్యటన‌లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విష‌యం వెళ్లడంతో ఆయ‌న వెంట‌నే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘ‌ట‌న‌తో సంబంధం ఉంద‌ని భావించిన వారిని వెంట‌నే అక్కడి నుంచి త‌ప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్ చేయాల‌ని ఆదేశించారు. ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారు ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఘ‌ట‌న‌లో బాధితుల‌కు న్యాయం చేయ‌డంతో పాటు వారికి అండ‌గా ఉంటామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read also: Andhra Pradesh: మరో శాఖలో అవకతవకలపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బంగారం చోరీ కేసులో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఉపయోగించక ముందే మహిళా సునీతపై షాద్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. గత నెల 24వ తేదీన ఆమెపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో 333(3)305 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఆ తరువాత విచారణ పేరుతో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారనీ, బాధితుల ఆరోగ్య పరిస్థితి బాగాలేక నడవలేని స్థితిలో ఉన్న విషయం వారిని చిత్రహింసలకు గురి చేసిన ఘటన వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ ఘటన విషయమై వార్తలు అటు ప్రతిపక్ష పార్టీలను ప్రజాసంఘాలను ఇటు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై ఇప్పటికే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని పోలీసు ఉన్నత స్థాయి అధికారులు సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. మొత్తం దీంట్లో ఐదుగురు పోలీసు సిబ్బంది టార్చర్ చేసినట్టు చిత్రహింసల గురి చేసినట్టు తెలుస్తుంది. దళిత మహిళపై దాడి చేసి, చిత్రహింసల గురిచేసిన పోలీసు సిబ్బందిలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి తో పాటు క్రైమ్ సిబ్బంది రఫీ ,మోహన్ లాల్ ,కరుణాకర్ , అఖిల, ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. విరిపై కూడా చర్యలు తీసుకోవాలని అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
Godavari River: గోదావరి దోబూచులాట.. 33.5 అడుగులకు నీటిమట్టం..

Show comments