NTV Telugu Site icon

Telangana Honour Killing: తెలంగాణలో మరో పరువు హత్య.. లేడీ కానిస్టేబుల్ను నరికి చంపిన తమ్ముడు

Murder

Murder

Telangana Honour Killing: తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుందని లేడీ కానిస్టేబుల్‌ నాగమణిని ఆమె తమ్ముడు పరమేష్‌ దారుణంగా నరికి చంపేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఈ పరువు హత్య కలకలం రేపుతోంది. హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగమణి.. ఈ రోజు (డిసెంబర్ 2) ఉదయాన్నే స్వగ్రామం రాయపోలు నుంచి హయత్‌నగర్‌ వెళ్తుండగా.. ఈ క్రమంలో ఆమె కోసం దారికాచిన తమ్ముడు పరమేష్.. ముందు కారుతో ఢీకొట్టి.. ఆ తర్వాత కొడవలితో మెడ పై నరికాడు పరమేష్. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read Also: Shocking : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన 12th ఫెయిల్ నటుడు

కాగా, 2020 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ నాగమణి, శ్రీకాంత్ లవ్ చేసుకున్నారు. ఇద్దరూ నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత హయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. నిన్న కానిస్టేబుల్ నాగమణికి సెలవు కావడంతో సొంత గ్రామానికి వెళ్ళింది.. ఈరోజు ఉదయాన్నే స్కూటీపై తిరిగి పోలీస్ స్టేషన్ కు వస్తుండగా.. ఈ క్రమంలో ఆమెను వెంబడించిన తమ్ముడు పరమేశ్ మొదట కార్ తో ఢీ కొట్టి అనంతరం కొడవలితో మెడపై నరికి హత్య చేశాడు. ఇక, తన అక్క కానిస్టేబుల్ నాగమణిని చింపేసిన తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి అతడు లొంగిపోయాడు.. దీంతో నిందితుడు పరమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.