NTV Telugu Site icon

పాత పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త కోణం

అప్పుల బాధతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. రామకృష్ణతో పాటు ముగ్గురు చనిపోయిన వ్యవహారంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంలో గోప్యతను పాటిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.

గతంలో ఒక్క వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో ఓ రాజకీయ నాయకుడి కుటుంబం పాత్ర ఉందని ప్రచారం జరిగింది. తాజాగా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ భార్య లక్ష్మీ, కూతురు సాహిత్యలు చనిపోయారు. పెట్రోల్ కుటుంబ సభ్యుల అందరి మీద పోసి అగ్గి ముట్టించారు. అయితే ఒక్క కుతురు సాహితీ మంటల నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. ముగ్గురు చనిపోగా సాహిత్య 60 శాతం గాయాలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

Read Also:ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసంపై డీజీపీకి లేఖరాసిన చంద్రబాబు

రామకృష్ణ ఇటీవల కాలంలో పలు వ్యాపారాలు చేసి నష్ట పోయాడు. 30 లక్షల దాకా అప్పులు పెరిగాయి. అయితే అప్పుల బారి నుంచి తప్పించుకునేందుకు ఇల్లు అమ్మాలని తల్లి పై ఒత్తిడి తెచ్చాడు. కానీ తల్లి ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో తల్లి, తన సోదరితో రామకృష్ణకు వివాదం కొనసాగుతోంది. దీంతో పాల్వంచలో తాను నడుపుతున్న మీసేవా కేంద్రాన్ని లీజుకు ఇచ్చేశాడు. ఆ తరువాత రాజమండ్రికి తన నివాసాన్ని మార్చాడు. అక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాడు.

అయితే ఇల్లు అమ్మడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ వ్యవహారం అధికార పార్టీ నేతల వద్దకు వెళ్ళింది. గతంలో రామకృష్ణ అధికార పార్టీ నాయకులకు సహకరించాడు. ఎన్నికలలో ప్రచారం కూడా నిర్వహించారు. అధికార పార్టీ నేతకు చెందిన బంధువులకి రామకృష్ణ కుటుంబం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేతలు పంచాయతీలో పాల్గొన్నారు. ఆస్తి తగాదాపరిష్కారం చేస్తామని పలుమార్లు భేటీ అయ్యారు అయితే ఈ వ్యవహారంలో రామకృష్ణకు వ్యతిరేకంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి.

Read Also: 2018 చర్ల ఎన్‌ కౌంటర్‌పై హైకోర్టు కీలక తీర్పు

వనమా రాఘవేందర్‌రావుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం: ఏఎస్పీ, రోహిత్‌ రాజు
పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కొత్తగూడెం ఎమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేందర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రోహిత్‌ రాజు తెలిపారు. రాఘవేందర్‌ రావు పరారీలో ఉన్నారు. లోకేషన్‌ ట్రేస్‌ చేస్తున్నాం. అతని కోసం స్పెషల్‌ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయని, ఇదే ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతుందని ఏఎస్పీ తెలిపారు.