NTV Telugu Site icon

రామకృష్ణ మరో సంచలన సెల్ఫీ వీడియో..

తెలంగాణలో పాల్వంచ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించింది… బాధితుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆ వీడియోలో రామకృష్ణ బయటపెట్టిన అంశాలు కలకలం సృష్టించగా.. తాజాగా, మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. భార్య, పిల్లలతో సహా తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవతే కారణమని ఆ వీడియోలోనూ స్పష్టం చేసిన రామకృస్‌ణ.. రాఘవతో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానని పేర్కొన్నాడు.. తన బలవన్మరణానికి సూత్రధారి రాఘవేనని ఆరోపించారు. తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారని ఆవేదిన వ్యక్తం చేశాడు.. ఇక, తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దంటూ వేడుకున్నారు.. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..