Raksha Bandhan : రక్షా పౌర్ణమి సందర్భంగా రామాయంపేట బస్ స్టేషన్‌లో జరిగిన ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామారెడ్డి బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జి ఎస్ నారాయణ తన షెడ్యూల్ ప్రకారం ప్రయాణం చేస్తున్నపుడు రామాయంపేట వద్ద కొద్ది సేపు ఆగిన సందర్భంలో, అతని సోదరి శారద అక్కడికి వచ్చి తన సోదరుడికి రాఖీ కట్టింది. రక్షాబంధన్ పండుగ సమయంలో సెలవు తీసుకోకుండా విధులు నిర్వరిస్తున్న నారాయణ తన డ్యూటీపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తే.. ఆయన సోదరి శారద బస్టాండ్ కు వచ్చి రాఖీ కట్టడం వారి మధ్య ఉన్న సోదరసోదరీ భావాన్ని మరింత నిదర్శనంగా నిలిచింది.
Peddi : ’పెద్ది’ కోసం కీలక వ్యక్తిని తీసుకొచ్చిన రామ్ చరణ్
ఈ సంఘటన సామాన్యమైనదే అయినా, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఉద్యోగ బాధ్యతల కారణంగా పండుగలను దూరంగా గడుపుతున్న కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న బంధాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తుంది. రామాయంపేట బస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న వీరి బంధం అందరినీ హృదయపూర్వకంగా స్పర్శించింది. రక్షాబంధన్ పండుగ అంటే కేవలం ఒక పండుగ కాకుండా, కుటుంబ ప్రేమ, సోదర బంధం అనుబంధాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సందర్భంలో ఈ చిన్న సంఘటన ప్రతి ఒక్కరికీ సోదర-సోదరులు మధ్య ప్రేమ, బాధ్యతను గుర్తు చేస్తుంది.
