NTV Telugu Site icon

Chandababu: నిన్న పవన్.. నేడు రజినీ కాంత్ తో చంద్రబాబు మంతనాలు

Rajini

Rajini

Chandababu: ఆదివారం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన ఇంటివద్ద మర్యాద పూర్వకంగా కలిసిన విషయం విదితమే. వీరిద్దరి కలయిక రెండు తెలుగు రాష్ట్రాల్లోను పెను సంచలనంగా మారింది. అయితే వారిద్దరి మధ్య పొత్తు గురించి కూడా టాపిక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయమే ఇంకా ఈ హీటే ఇంకా చల్లారలేదు..తాజాగా మరో హీట్ ఎక్కించే ఫోటోను చంద్రబాబు షేర్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఆయన భేటీ అయ్యారు. నేడు హైదరాబాద్ విచ్చేసిన రజినీ.. చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పట్టు శాలువా కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.

ప్రస్తుతం జైలర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన తలైవా.. షూట్ అయ్యాకా చంద్రబాబును కలవడం జరిగింది. కొద్దిసేపు వారిద్దరూ ముచ్చటించుకున్నట్లు సమాచారం. ఇక వారు దేని గురించి చర్చించుకున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన చంద్రబాబు.. “నా ప్రియమైన మిత్రుడు రజినీకాంత్ ను కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే రజినీ- చంద్రబాబు మంచి స్నేహితులు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి రజినీ- చంద్రబాబు కలుస్తూ ఉంటారు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి చంద్రబాబుతో ముచ్చటించి వెళ్తారు. దీంతో ఈసారి కూడా అలాగే కలిసి ఉంటారు అని టీడీపీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. నిన్న పవన్ తో, నేడు రజినీతో చంద్రబాబు మంతనాలు.. అసలేం జరుగుతోంది అని రాజకీయ నాయకులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.